జానా బాబా 40 దొంగలు..  కేటీఆర్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

జానా బాబా 40 దొంగలు..  కేటీఆర్ ఫైర్

March 1, 2018

‘ ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా జానా బాబా 40 దొంగలు వీళ్ళు.  సిగ్గు, శరం విడిచి బస్సు యాత్ర చేస్తున్నారు. వీళ్ళందరి పైనా కేసులు వున్నాయి ’ అని  తెలంగాణ ఐటీ  మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులను ఎగతాళి చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన కేటీఆర్, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు.‘ ఫ్లోరోసిస్ బాధితుల పాపం కాంగ్రెస్‌దే. 50 ఏళ్ళు పాలించిన ఆ పార్టీ జిల్లాకు కృష్ణా జలాలను తెచ్చుంటే 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడేవారు కాదు. ఆయన 15 ఏళ్ళు మంత్రిగా వుండి ఉద్ధరించింది ఏమీ లేదు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న అవస్థలు వారి కంటికి కనిపించలేవా ? ’ అని ప్రశ్నించారు.

ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా వెంపటి, రుద్రమదేవి చెరువులను కలుపుతూ పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేస్తామని, జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని అన్నారు. మా ప్రభుత్వం ఈ జిల్లాకు రూ. 30 వేల పెట్టుబడిని రప్పించిందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించటానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తుంగతుర్తి సమీపంలో ఏర్పాటు చేస్తామన్నారు.