పట్నం ఆడబిడ్డలకు 7 లక్షల బతుకమ్మ చీరలు...! - MicTv.in - Telugu News
mictv telugu

పట్నం ఆడబిడ్డలకు 7 లక్షల బతుకమ్మ చీరలు…!

September 13, 2017

బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని, మహిళలకు ఏడు లక్షల చీరలను పంపిణి చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి జానార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18,19 తేదీలలో బతుకమ్మ చీరలను పంపిణి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

మెుత్తం 640 రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డలు కలిగిన మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆహార భద్రత కలిగిన మహిళలు తమ గుర్తింపుగా.. ఆధార్ కార్డుగాని, ఎలక్షన్ గుర్తింపు కార్డు, జిరాక్స్ కాపీని గానీ సమర్పించాలని కమిషనర్ సూచించారు. చీరల పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని తెలిపారు.