mictv telugu

పవన్ బాబు పంచ్ సూపర్.. మరి ఈ ప్రశ్నలకు బదులేది?

November 4, 2018

తనను ఎపీకి సీఎంను చేయాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు బంపర్ ఆఫర్  ఇచ్చారు. తాను గద్దెనెక్కితే  ఏం చేస్తానో కూడా చెప్పారు. కాకపోతే చంద్రబాబు నాయుడు, జగన్ చెప్తున్నది కూడా అదే. గతంలో చంద్రబాబునాయుడు తనను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేప్తాడో, ఏం చేస్తే బావుంటుందో కూడా చెప్పారు.  మీరు కూడా అదే అంటున్నారు. కాకా పోతే మీరు చాలా ఫైర్‌తో ఆ మాటలు అంటున్నారు.

yy

తాను సీఎం అయితే  గనుక ఖనిజ వ నరుల తవ్వకాలు లేకుండా చేస్తాననే  తీరులో మాట్లాడుతున్నారు. మీ రాజకీయ మేనిఫెస్టో ఏమిటో, మీ ఎజెండా ఏమీటో ముందు ప్రజల ముందు పెట్టాలి కదా.  ప్రతీ సారి  ఎన్నికల ముందు రావడం  ప్రచారాలు చేయడం తిరిగి పెవిలియన్ కు వెళ్లడం ఇదే మీరు ఇన్నాళ్లు చేస్తూ వచ్చింది, ఇప్పుడే కొత్తగా వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

పవన్ గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకు మద్దతునిచ్చారు. అప్పుడు జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్‌ను వెనకేసుకొస్తున్నట్లు కన్పిస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఏదో పార్టీకి మద్దతునిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారనే కమ్యూనిస్టులను  వెంటేసుకుని తిరుగుతున్నారు. ఇవన్నీ జనంలోకి ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తున్నాయి? మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు?  ఏపి ప్రజల పక్షాన నిజంగానే నిలబడాలని అనుకుంటున్నారా? కొత్త రాజకీయాలను   తేవాలని అనుకంటున్నారా? కొత్త రాజకీయ తరాన్ని తయారు చేయాలని అనుకుంటున్నారా? మీరు తీసుకొచ్చే మార్పు ప్రజల జీవితాల్లో ఎలా ఉండాలి? ఎలాఉంటుందని అనుకుంటున్నారు? దానికి సంబంధించిన  కార్యక్రమం మీ దగ్గర ఉందా?

rere

ఈ తరహా ప్రశ్నలన్నింటికీ  పవన్ బాబు ముందు సమాధానం చెప్పాలి.  యాత్రలు చేసుకుంటూ పోతే జనాలు వింటూ పోతూ ఉంటారు.  డైలాగులు బాగా చెప్పినప్పుడు చప్పట్లు కొడ్తారు. తాను సీఎంను అయిన తర్వాత బాగా పనిచేయక పోతే చొక్కా పట్టుకు నిలదీయాలని అంటున్నారు. ఈ డైలాగ్ వినడానికి బాగానే ఉంది. కానీ కిందటి సారి ఎన్నికల్లో చంద్రబాబుకు, మోడీకి సానుకూలంగా ఉన్నారు కదా? పెద్ద  నోట్ల రద్దు తర్వాత  జరిగిన పరిణామాల గురించి ఏ  కార్యక్రమం  తీసుకున్నారు? మోడీ ప్రభుత్వం హయాంలో పెరుగుతున్న ధరల గురించి మీ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకూ సమాధానం చెప్పాలి.

rtrt

అయినా  రాజకీయాలు సినిమా తీసినంత ఈజీ కాదని మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. మీరు అధికారంలో  లేరు కాబట్టి… అటూ విపక్షంగా కూడా లేరు కాబట్టి ఏది మాట్లాడిన బాగానే ఉంటుంది. కాకపోతే భవిష్యత్తులో  ఏపీ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవాలని పవన్ పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు.  ఏపీ  రాజకీయాలు మూడు యాంగిల్స్‌లో నడుస్తున్నాయని  అంటున్నారు. ఎవరిపై భరోసా  ఉంచాలనే దానిపై ప్రజలకు ఓ క్లారిటీ ఉందని కూడా రాజకీయ పండితులు చెప్తున్నారు.

 

ప్రజలకు జవాబు దారిగా ఉండే  నాయకున్నే ఎన్నుకుంటారు. వారినే నమ్ముతారు. మరలాంటి నమ్మకాన్ని ఏ నాయకుడు ఇస్తాడో. నిజంగానే పవన్ సిఎం అయితే గనుక ప్రజలకు అంత జవాబు దారిగా ఉంటారా? ఉండాలంటే ముందు తాను కొత్త రాజకీయ తరాని తయారు చేస్తున్నట్లు అక్కడి జనాలు నమ్మాలి.  అంతే కాదు తన రాజకీయ విదానాన్ని ప్రజల ముందు పెట్టాలి. గతంలో చాలా మంది ఇలాగే చెప్పారు. కానీ చేసిందేమిటో ప్రజలకు తెలుసు. అలా కాకుండా  నిర్ధిష్టంగా,మిగతా వారికి భిన్నంగా  కార్యాచరణ ఉంటే తప్పకుండా పవన్ కోరికి  నెరవేరుతుంది. ఏపీ ప్రజలకు మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం దొరుకుతుంది.