స్మోకింగ్ మానేస్తే బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

స్మోకింగ్ మానేస్తే బంపర్ ఆఫర్

November 1, 2017

ఆఫీస్ పనివేళల్లో  పొగత్రాగేవారికి  బంపర్ ఆఫర్ ఇచ్చాయి జపాన్ కంపెనీలు. ఎవరైతే పొగ తాగడం మానేస్తారో వారికి అదనంగా జీతంతో పాటు, సెలవులు కూడా ఇస్తామని  ఆశ చూపాయి.టోక్యో ఆధారిత  మార్కెటింగ్‌ కంపెనీ  పియాలా ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం బయటకు వెళ్లే వరకు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోకూడదు.  సిగరెట్ తాగకూడదు.  ఈ నిబంధనలకు ఒకే అంటే చాలు అడ్వాన్స్ కూడా ఇస్తామని ప్రకటించింది. రోజు రోజుకు ఉద్యోగుల్లో పెరుగుతున్న స్మోకింగ్ కల్చర్ ను అరికట్టేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కొందరు పొగరాయుళ్లు  సిగరెట్లపై ఉన్న మక్కువతో ఈ ఆఫర్లను కూడా తిరస్కరించారట.