వన్డే జట్టులోకి హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్

ఈనెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి కల్పించింది బీసీసీఐ. బుమ్రా స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌‌కు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ద్వారా వివరాలను వెలువరించింది.Telugu News jasprit bumrah rested for India australia oneday international series and mohammed siraj taken into teamఅలాగే, న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌లకి సిద్దార్థ్ కౌల్‌ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణించి మొత్తం 21 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.