ఆకట్టుకున్న జవాన్ ట్రైలర్... - MicTv.in - Telugu News
mictv telugu

ఆకట్టుకున్న జవాన్ ట్రైలర్…

November 23, 2017

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ జవాన్’. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇప్పటివరకు యూత్  ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసిన సాయి. ఈ సినిమాతో కుటుంబ ప్రక్షేకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

‘ బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌‌లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది..ఫ్రస్టేషన్‌ ’ అని ఓ చిన్నారి చెప్తున్న డైలాగ్‌ ఫన్నీగా ఉంది. సినిమా మొత్తం ఆక్టోపస్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ని జవాన్‌గా ధరమ్‌తేజ్‌ ఎలా కాపాడతాడు అన్న నేపథ్యంలో ఉంటుంది. ఇందులో తమిళ నటుడు, నటి స్నేహ భర్త ప్రసన్న ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. పోరాట సన్నివేశాల్లో ‘యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అని ధరమ్‌ చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను అరుణాచల్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు.  దిల్‌రాజు  సమర్పిస్తున్నాడు. ఎస్ .ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.