ఆమె.. జయ, శోభన్‌బాబుల కూతురే - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె.. జయ, శోభన్‌బాబుల కూతురే

December 2, 2017

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుతూరినంటూ సుప్రీం  కోర్టుకెక్కిన  బెంగళూరు యువతి ఆమృతను ధర్మాసనం మందలించడం, ఈ వివాదాన్ని హై కోర్టులోనే  పరిష్కరించుకోవాలని చెప్పడం తెలిసిందే.  అయితే ఆమెనే జయ కూతురు అని జయ స్నేహితురాలు గీత  ఓ టీవీ చానల్‌కుఇంట్ర్వ్యూలో బాంబు పేల్చారు.‘అవును.. జయలలితకు కుతూరు ఉంది . అలనాటి హీరో శోభన్ బాబుతో జయకు కల్గిన సంతానమే ఆమృత.  ఈ విషయాన్ని నాకు స్వయంగా జయలలితే  చెప్పింది. ఆ బిడ్డ పేరు అమృత. వారి మధ్య చక్కని సంబంధాలు ఉండేవి.. అయితే జయ ఆ సంగతి అమృతతో చెప్పిందో నాకు తెలియదు’ అని గీత వెల్లడించింది.

ఈ విషయం గురించి తనతో శోభన్ బాబు కూడా  మాట్లాడేవారని కూడా గీత చెప్పింది. తనకు, జయకు ఒక కూతురు పుట్టిందని 1999లోనే చెప్పాడని వివరించింది.  జయ, కూతురినంటున్న ఆమృతకు డీఎన్ఏ పరీక్షలు చేస్తే విషయం స్పష్టమవుతుందని గీత  తెలిపారు. కాగా జయకు ఒక కూతరు పుట్టిన సంగతి నిజమేనని ఆమె  మేనత్త కూతరు లలిత చెప్పడం తెలిసిందే.