జయలలిత, శోభన్ బాబుల బిడ్డను  - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత, శోభన్ బాబుల బిడ్డను 

August 30, 2017


‘నేను జయలలిత, శోభన్ బాబులకు పుట్టాను.. ’ అని అమృత అనే బెంగూళూరు యువతి  సంచలన ప్రకటన చేసింది. జయ కూతురినని  నిరూపించుకునేందుకు డీఎన్ ఏ పరీక్షలకు కూడా సిద్ధం అని చెప్పింది. అంతేకాకుండా  జయలలితది సహజ మరణం కాదని , అసలు నిజాలు తెలుసుకోవడానికి సీబిఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీకి , రాష్ట్రపతి కోవింద్ లకు ఆమె లేఖలు రాసింది.

“ఆ లేఖలోని సారాంశమంతా ఒకటే..  జయలలిత నా కన్న తల్లే అని.  జయలలిత తన తల్లిదండ్రుల మరణం తర్వాత మానసికంగా కుంగిపోయి ఉన్నప్పుడు అప్పటి హీరో శోభన్ బాబు ఆమెకు దగ్గరయ్యాడు. వారి ప్రేమానుబంధానికి  గుర్తునే నేను. సమాజంలోని కొన్ని కారణాల వల్ల వారు పెళ్లి చేసుకోలేదు. జయలలిత  బెంగళూరులో ఉంటున్నతన సోదరైన శైలజ దంపతులకు నన్ను అప్పగించింది. ఈ విషయం ఎవరికీ చెప్పదంటూ ఒట్టు తీసుకుంది. 1996లో జయను కలవాల్సిందిగా శైలజ నాకు చెప్పారు. నేను జయను కలిసినప్పడు ఆమె నా వివరాలు తెలుసుకుని నన్ను ఆలింగనం చేసుకున్నారు.  నాతో ప్రేమగా మాట్లాడారు.. తర్వాత కూడా  నేను జయను అనేక సార్లు కలిశాను. కానీ ఆమె ఏనాడు తనే నా తల్లి అని చెప్పలేదు’’ అని అమృత చెప్పింది.

‘‘జయ మరణం తర్వాత ఆమెకు తామే వారసులమని మేనల్లుడు, మేనకోడులు దీప మీడియా ముందుకొచ్చారు. అది చూసి  అమెరికాలో ఉన్న మా బంధువు జయలక్ష్మి నాకు ఫోన్ చేసింది.  ‘జయలలిత సంతానం నువ్వే’ అని  చెప్పింది. బెంగళూరులో  ఉంటున్న మరొక బంధువు కూడా జయలలిత కుతూరివి నువ్వే అని చెప్పింది. నా తల్లిని కొందరు కుట్ర చేసి, కావాలనే హత్య చేశారు. శశికళ, ఆమె భర్తల నటరాజన్ లపై అనుమానాలున్నాయి” అని అమృత లేఖలో రాసింది.