జయేంద్ర సరస్వతి ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

జయేంద్ర సరస్వతి ఇకలేరు

February 28, 2018

కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) పరమపదించారు. తమిళనాడులోని ప్రసిద్ధ కాంచీపురం 69వ పీఠాధిపతిగా ఆయన సేవలు అందించారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు.  శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురైన జయేంద్ర సరస్వతి చెన్నై పోరూరులోని ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరమపదించారు. జయేంద్ర సరస్వతి 18 జూలై  1935లో తంజావూరు జిల్లాలోని ఇరుల్‌నీకిలో జన్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1987లో ఆయన మఠం నుంచి హఠాత్తుగా కనిపించకపోవడం సంచలనం సృష్టించింది. తర్వాత మళ్లీ ఆయన మఠానికి వచ్చారు. మఠం మాజీ ఉద్యోగి శంకర రామన్ హత్య కేసులో జయేంద్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయనే రామన్ ను చంపించారని అభియోగాలు దాఖలయ్యాయి. తర్వాత జయేంద్రను కోర్టు నిర్దోషింగా ప్రకటించింది.