జగన్‌ను వాడూ, వీడూ.. అని అంటా... - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ను వాడూ, వీడూ.. అని అంటా…

November 27, 2017

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ నేత జగన్‌కు అత్యంత సన్నిహితుడట. ఈ విషయాన్ని ఆయనే మీడియాకు స్పష్టం చేశారు. ‘అవును రాజకీయంగా నేను జగన్‌ను ఎంత విమర్శించినప్పటికీ.. నాకూ జగన్ కుటుంబానికి దగ్గర సంబంధం ఉంది.  అందుకే జగన్‌ను  వాడూ,వీడు అని సంబోధిస్తూ ఉంటాను’ అని  జేసీ చెప్పారు.

జగన్ పాదయాత్రపై స్పందిస్తూ… ‘రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడుస్తున్నా కూడా ప్రజలు చూడడానికి ఎగబడతారు, అలాగే జగన్ పాదయాత్రకూ.. వస్తున్నారు’ అన ఎద్దేవా చేశారు. ‘అనంతపురంలో నన్ను ఏదో చెయ్యాలని కొన్ని దుష్టశక్తులు నా వెంటపడుతున్నాయి, అందులో నా పార్టీకి చెందినావారు కూడా ఉన్నారు, అయినా నేను భయపడను’ అని జేసీ అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా కలుషిత రాజకీయాలే నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.