చంద్రబాబుగా జేడీ చక్రవర్తి  - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబుగా జేడీ చక్రవర్తి 

October 25, 2017

రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ సినిమాను చేస్తున్నానని ఎప్పుడైతే ప్రకటించాడో అప్పట్నించి ఈ సినిమా గురించిన వార్త ఏది బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ అయిపోతోంది. వర్మ కూడా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే చాలా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో కీలకమైన  చంద్రబాబు నాయుడిపాత్రకు జేడీ చక్రవర్తిని తీసుకుంటుండొచ్చు లేకపోతే లేదు అన్నట్టు వర్మ ఫేస్ బుక్ పోస్టులో చెప్పాడు.  చంద్రబాబు పాత్రే ఈ సినిమాలో కీలకమైనది. విలన్‌గానే జెడీని తీసుకుంటున్నాడు వర్మ. కాకపోతే చంద్రబాబు పాత్రకా కాదా అనేది తేలాల్సి వుంది. జెడీ చక్రవర్తి వర్మకు ప్రియ శిశ్యుడు.

చాలా ఏళ్ళుగా వారిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. ‘ సత్య’ సినిమాతో జెడీకి హిట్టిచ్చాడు వర్మ. లక్ష్మీ పార్వతి పాత్రకు రోజాను, ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను తీసుకుంటున్నట్టు చెప్పిన వర్మ చివరికి ఆ పాత్రల్లో కొత్తవారినే తీసుకుంటున్నాడని వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రధానంగా జరిగిన వైస్రాయ్ హోటల్ ఘట్టం వుంటుందా.. వుండదా..? అనేది వర్మకే తెలియాలి.