బాయ్‌ఫ్రెండ్ కోసం భార్యను హత్యచేసిన గే…  

అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతాయి. భర్త ఇతర స్త్రీతోనో, భార్య ఇతర పురుషుడితోనో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ కాపురాలు కొల్లేరు అవుతాయి. హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తాయి. ఈ నేపథ్యంలో ఓ భర్త భార్యను హతమార్చాడు. కారణం అతను గే. స్వలింగ సంపర్కానికి భార్య అడ్డుగా వుందని ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తొలుత దొంగలు తన భార్యను చంపేశారని కోర్టును నమ్మించాడు. కానీ కోర్టు విచారణ జరిపి అతనే భార్యను చంపిన హంతకుడు అని తేల్చింది. కటకటాల వెనకకు నెట్టింది. వివరాల్లోకి వెళ్తే…

Telugu news Jessica Patel murder Gay hubby Mitesh killed her to be with Amit happily ever after..

బ్రిటన్‌లో గత నెలలో టీస్సైడ్‌ క్రౌన్‌ కోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బరో ప్రాంతంలో భారత సంతతికి చెందిన జెస్సికా, మితేశ్‌ పటేల్‌(37) మ్యాంచెస్టర్‌లో చదువుకునే సమయంలో పరిచయమయ్యారు.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు వారి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరూ కలిసి మూడేళ్లుగా మిడిల్స్‌బరో ప్రాంతంలోని రోమన్‌ రోడ్డులో మందుల దుకాణం నడుపుతున్నారు. ఈ క్రమంలో మితేశ్ గే డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన బాయ్‌ఫ్రెండ్‌‌తో ప్రేమలో పడ్డాడు. అతని కోసం భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. భార్యను చంపి ఆమె పేరుమీద వచ్చే పాలసీ డబ్బులతో బాయ్‌ఫ్రెండుతో హాయిగా ఆస్ట్రేలియా వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నాడు.

భార్యను ఎలా చంపాలని ఇంటర్నెట్‌లో వెతికాడు…

భార్యను చంపడానికి ఇంటర్నెట్‌లో ‘నేను నా భార్యను చంపాలి’, ‘నా భార్యను చంపేందుకు పథకం కావాలి? మరొకరి సహాయం అవసరమా?’, ‘ఇన్సులిన్‌ ఓవర్‌డోస్‌’,  ‘ఎంత మొత్తం మెథడోన్‌ చంపేస్తుంది?’, ‘యూకేలో హిట్‌మ్యాన్‌ను ఎలా హైర్‌ చేసుకోవాలి?’ అని చాలా రకాలుగా సెర్చ్ చేశాడు. ఆ తర్వాత మితేశ్‌ భార్యను ఇంట్లో కట్టేసి ఇన్సులిన్‌ అధిక మోతాదులో ఎక్కించి, ఆమెను ప్లాస్టిక్‌ కవర్‌తో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు పోలీసుల ముందు నాటకాలు ఆడాడు.

తనకేమీ తెలియదని, ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దోపిడీ జరిగినట్లు సామాన్లన్నీ చిందరవందరగా పడి వున్నాయని, తన భార్య చనిపోయి ఉందని పోలీసులతో నమ్మబలికాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తొలుత నుంచి భర్త మీదే అనుమానం పెంచుకున్న పోలీసులు ఆ కోణంలో తమ విచారణ కొనసాగించారు. దర్యాప్తులో మితేశ్ తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. తను గేనని, బాయ్ ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నట్టు భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేవాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.

Telugu news Jessica Patel murder Gay hubby Mitesh killed her to be with Amit happily ever after