మధు కోడా ‘బొగ్గు’ మెక్కింది నిజమే.. - MicTv.in - Telugu News
mictv telugu

మధు కోడా ‘బొగ్గు’ మెక్కింది నిజమే..

December 13, 2017

వేల కోట్ల అవినీతి జరిగిన బొగ్గు బ్లాకుల కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కోడాతోపాటు,  బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులను  కోర్టు బుధవారం ధోషులుగా తేల్చింది.  వీరు కొంతమంది అనుచిత లబ్ధి చేకూర్చడానికి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది.కోర్టు రేపు (గురువారం) వీరికి శిక్షలను ఖరారు చేయనుంది.  కోల్‌కత్తాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్  ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్)కు జార్ఖండ్ లోని రాజ్హారా ప్రాంతంలో  బొగ్గు బ్లాకులు కేటాయించడానికి  మధు కోడా సహా మిగతా నిందితులు కలిసే కుట్ర చేశారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి భరత్ పరాశర్  తెలిపారు.