భార్యను వెతుక్కుంటూ సైకిల్‌‌పై 600 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను వెతుక్కుంటూ సైకిల్‌‌పై 600 కి.మీ.

February 14, 2018

ఈ రోజు ప్రేమికుల రోజు.  ప్రేమికులు బోలెడు కొటేషన్లు చెప్పుకుంటున్నారు. మనసు, త్యాగం, వందేళ్ల తోడు.. అని అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ ఏమీ తెలియని  ఓ వ్యక్తి మాత్రం తన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ 600కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేసి అనుకున్నది సాధించాడు.

జార్ఖండ్‌లోని ముసాబని పట్టణానికి చెందిన మనోహర్ నాయక్ భార్య అనిత సంక్రాంతి పండుగ కోసం తన పుట్టిల్లు పశ్చిమబెంగాల్‌లోని కుమ్రసోల్‌కు జనవరిలో వెళ్లింది. పండుగ అయిపోయిన తర్వాత కూడా అత్తింటికి తిరిగి రాలేదు. అనితకు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆమె సరిగ్గా మాట్లాడలేదు. దాంతోనే నాయక్ భయాందోళనకు గురైనాడు.పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ తన భార్యను వెతికి పెట్టడం పోలీసుల వల్ల కాదనుకున్నాడు. తన పాత సైకిల్ సిద్ధం చేసుకుని రోజుకు 25 కిలో మీటర్ల చొప్పున 24 రోజుల పాటు ప్రయాణం చేసి తన భార్య సొంత ఊరికి చేరుకున్నాడు. అక్కడ వెతికినా భార్య ఆచూకీ లభించలేదు. దాంతో స్థాని వార్తాపత్రికను సంప్రదించారు. ఆ పత్రికలో ఆమె ఫోటోను  ప్రచురించారు. ఆ వార్తను చూసిన కొందరు ఆమెను ఖరగ్‌పూర్‌లో చూసినట్టు సమాచారం అందించారు. పోలీసుల సాయం తీసుకుని ఎట్టకేలకు నాయక్ తన భార్యను కలుసుకున్నాడు.