జియోకు పోటీగా ఎయిర్ టెల్ 4జీ  - MicTv.in - Telugu News
mictv telugu

జియోకు పోటీగా ఎయిర్ టెల్ 4జీ 

August 30, 2017

టెలికం మార్కెట్లో మరో ఆసక్తికర పోటీకి తెరలేచింది. ఎయిర్ టెల్.. జియోకు గట్టి పోటీని ఇవ్వనుంది. జియో ఇస్తున్న ఉచిత 4జీ హ్యాండ్ సెట్ కు పోటిగా ఎయిర్ టెల్ తన 4జీ హ్యాండ్ సెట్  ఫోన్లను సిద్ధం చేస్తోంది. దీని ధర రూ. 2500. ఇది ఉచితం కాదు.  ఈ ఫోన్లు జియో ఫోన్లకంటే నాణ్యమైన  స్క్రీన్ తో తయారవుతున్నాయని కంపెనీ చెబుతోంది.  

తమ ఫోన్ లో మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ,పెద్ద స్క్రీన్ ఉంటాయని అంటోంది. ఒకసారి ఎయిర్ టెల్ సిమ్ వేసుకుంటే మరో కంపెనీ గురించి ఆలోచించరని  చెబుతోంది. ఈ ఫోన్ విడుదలకు  సంబందించిన పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఎయిర్ టెల్ లావా, కార్బన్ మెుబైల్ తో సంప్రదింపులు జరుపుతోంది.

ఉచిత సిమ్ లతో జియో తన స్కైబర్లను 13  కోట్లకు పెంచుకుంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి 4జీ హ్యాండ్ సెట్ తో  మరో 10 కోట్లకు పెంచుకోవాలని పావులు కదుపుతోంది.  జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా 4జీ  హ్యండ్ సెట్ ఫోన్లను దీపావళికి విడుదల చేయనుంది.  జియో హ్యాండ్ సెట్ ఫోన్ ధర రూ. 1500 అన్న విషయం తెలిసిందే.

ఈ డబ్బును ఇప్పుడు చెల్లిస్తే తిరిగి మూడు సంవత్సరాల తిరిగి ఆ మొత్తాన్ని వినియోగదారుకు రీఫండ్ చేస్తారు. అంటే ఫోన్ ఉచితంగా వస్తున్నట్లే. టెలికం రంగంలో జియో రాకతో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వోడా ఫోన్ నుంచి 13 లక్షల 89 వేల, ఐడియా నుంచి 23 లక్షల 20 వేల మంది కస్టమర్లు తప్పుకున్నారు. వీరిలో ఎక్కువ మంది జియోకు మారగా, మిగిలిన వారు ఎయిర్ టెల్ కు మారారు.