మళ్లీ ధర పెంచిన జియో - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ ధర పెంచిన జియో

October 26, 2017

కళ్ళు చెదిరే ఆఫర్లతో వినియోగదారులను తన వైపుకు తిప్పుకుని ఇతర టెలికం సర్వీసులకు చెమట్ల పట్టించింది జియో. అయితే తర్వాత వినియోగదారులపై క్రమంగా భారం వేస్తూ వాడి నడ్డి విరుస్తోంది.

నష్టాల నేపథ్యంలో కాస్తో కూస్తో అదనంగా యూజర్ల నుంచి రాబట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది. దీపావళి సందర్భంగా ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం రూ.491 రీఛార్జ్‌ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది జియో. ఈ ప్యాక్‌తో 91రోజుల పాటు రోజుకు 1జీబీ చొప్పున 4జీ డేటాను పొందవచ్చని చెప్పిన జియో చడీ చప్పుడు కాకుండా ఈ ప్లాన్‌ ధరను పెంచేసింది. ప్రస్తుతం ఎక్కవ రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌  ధర సోమవారం వరకు రూ.491గానే ఉంది. అయితే నేటి నుంచి రూ.499కి పెంచారు. వారం రోజులు కూడా తిరక్క ముందే జియో ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యకుండానే ప్లాన్ ధరను పెంచేసింది. మై జియో యాప్‌లో మాత్రం కేవలం రూ.499 మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఈ మార్పు చేసినట్లు జియో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు.