ధరలు పెంచిన జియో  - MicTv.in - Telugu News
mictv telugu

ధరలు పెంచిన జియో 

October 19, 2017

మంది ఎక్కువైతే మజ్జిగ  కూడా పలచగా అవుతుంది అన్న సామెతలాగానే ఉంది జియో వ్యవహరం. తక్కువ ధరకు ఆఫర్లును ప్రకటించి తరువాత వినియోగదారులపై భారం మోపుతోంది.  జియో తాను  ప్రకటించిన  టారీఫ్‌లను పెంచేసింది.  ఈ రోజు నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.

ఇప్పటి వరకు 84 రోజుల పాటు అపరిమిత కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రోజుకు 1 జీబీ డేటా  అధిక వేగం 4జీ డేటా కల్పించే ఆపర్ కు రూ. 399 . కానీ  ఇప్పుడు ఆ ఆపర్ ధరను రూ. 456కి పెంచింది.

రోజుకు 4జీబీ డేటా ఆఫర్‌ రూ. 599‌కు ఇప్పటి వరకు  56 రోజులు వ్యవధి ఉండగా దాన్ని  రోజులకు తగ్గించింది. రూ. 999 ఆఫర్‌కు 90 జీబీ డేటా ఉండగా ఇప్పుడు దాని 60 జీబీ 3 నెలల్లో వాడుకోవాలని కంపెనీ తెలిపింది.

కాగా, రూ. 149 ఆఫర్‌పై 2 జీబీ డేటా ఉండగా,  దీపావళి  ధమాకా ఆఫర్ 28 రోజులకు 4 జీబీ డేటా లభిస్తుంది. వారం రోజులకు రూ . 52, రెండు వారాలకు రూ. 98 తో రీచార్జ్ చేసుకుంటే  వీటి కింద అపరిమిత కాల్స్ , ఎస్ ఎమ్ ఎస్ లకు తోడు, రోజు 0.15 జీబీ డేటాను వాడుకోవచ్చురూ. 1,999 రీచార్జ్ తో 6 నెలల్లో 125 జీబీ డేటా లభిస్తుంది. రూ. 4,999 రీచార్జి తో 210 రోజుల్లో 390 జీబీ డేటాతోపాటుగా ఏడాది  కాలవ్యవధిలో 350 జీబీ డేటాను వాడుకోవచ్చని జియో తెలిపింది.