రండి బాబు రండి ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 5 ఫోన్లను బుక్ చేస్కోండి. ఆఫర్ పోతే మళ్లీ రాదు ‘ కమాన్ ఇండియా జాయిన్ ది మూమెంట్’ అంటూ జియో మళ్లీ తన ఫోన్ బుకింగ్లను అధికారిక వెబ్ సైట్లో ఓపెన్ చేసింది. ఆరు నెలల క్రితం కూడా మొదటి దశలో 60 లక్షల ఫోన్లను విక్రయించిన జియో ఇప్పుడు ఒకే నంబర్ పై ఏకంగా 5 ఫోన్ల బుకింగ్ చేసుకునే ఆఫర్ను ప్రకటించింది.
మొదటి దశలో బుకింగ్ అయిన 60 లక్షల ఫోన్ల డెలీవరి అయిపోవడంతో ఇప్పుడు మళ్లీ కొత్త బుకింగ్లను ప్రారంభించింది. భారత్లో ఫోన్ల అమ్మకాలపై గట్టిగా గురి పెట్టిన జియో..మొత్తం 50 కోట్ల మంది వినియోగదారులే లక్ష్యంగా ముందుకెళుతుంది.