జియో ఫోన్.. అమెజాన్ లోనూ. . క్యాష్‌బ్యాక్ కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఫోన్.. అమెజాన్ లోనూ. . క్యాష్‌బ్యాక్ కూడా..

February 17, 2018

జియో 4జీ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఈ కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంది. రూ. 1500 చెల్లించి వినియోగదారులు అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కొంటే రూ.50 క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నారు. ఇది పొందాలంటే వినియోగదారులు అమెజాన్ పే వాలెట్‌లో డబ్బులు లోడ్ చేసి అనంతరం ఈ ఫోన్‌ను కొనాలి. దీంతో రూ. 50 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా జియో ఫోన్‌లో సిమ్‌ను రీచార్జి చేస్తే దాంతో 50 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.

36 నెలల పాటు నెలకు రూ.153 ఆ పైన విలువ గల రీచార్జి ప్లాన్‌ను వాడితే ఆ కాల వ్యవధి తరువాత వినియోగదారుడు చెల్లించిన రూ.1500 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనేవారు ఫోన్‌ను డెలివరీ తీసుకున్నాక తమకు సమీపంలో ఉండే జియో లేదా రిలయన్స్ స్టోర్, ఔట్‌లెట్‌కు వెళ్లి తమ తమ ఆధార్ కార్డులను ఇచ్చి ఫోన్‌ను, జియో నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.49కే 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 28 రోజుల వాలిడిటీ ఉన్న తక్కువ నెలవారీ ప్యాక్‌ను కూడా జియో ఇటీవలే లాంచ్ చేసింది.

గతేడాది ఆగస్టులో ఈ ఫోన్‌కు ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవగా అనంతరం సెప్టెంబర్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో కొన్ని లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. తరువాత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్ ఓపెన్ సేల్‌లోనూ జియో విక్రయిస్తున్నది. ఇక ఇప్పుడు తాజాగా ఈ ఫోన్‌ను అమెజాన్ సైట్‌లోనూ అమ్మకానికి ఉంచటం విశేషం.