జియో రూ.49 ఇక అందరికీ.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో రూ.49 ఇక అందరికీ..

January 30, 2018

రెండేళ్ల క్రితం టెలికం రంగంలోని దూసుకొచ్చింది రిలయన్స్ జియో. చవక ఆఫర్లతో టెలికం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.  తాజాగా జియో రూ.49 తో కొత్త ఆఫరును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ 28 రోజుల పాటు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను అందిస్తుంది.  1జీబీ డేటా కూడా వస్తుంది. ఇంత తక్కువ ధరకు రెంటల్ ప్లాన్‌ను మరే ఇతర టెలికం కంపెనీ  ప్రకటించలేదు. కానీ ఈ ఆఫరు కేవలం జియోఫోన్ యూజర్లకే కావడంతో జనం నిరాశపడ్డారు. దీన్ని గుర్తించిన  జియో నిబంధనలను సడలించింది. ఈ ప్లాన్ జియోసిమ్ వాడే ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చని తెలిపింది. దీన్ని జియోఫోన్ నుంచి యాక్టివేట్ చేసుకుని తర్వాత ఇతర ఫోన్లలో వాడుకోవచ్చని వివరించింది.రూ.49, రూ. 153 ఆఫర్లను రెండింటిని జియో వినియోగాదారులు వాడుకోవచ్చు. జియోఫోన్‌పై ఈ ప్లాన్లను యాక్టివేట్ చేసుకున్న తర్వాత సిమ్‌ను బయటకు తీసి ఇతర స్టార్ట్ ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో వాడకోవాలనే నిబంధననేమీ లేదు. దాంతో ఈ రెండు ఆఫర్లుకు ఇది వాలిడ్‌లో ఉంటుంది.