జియోకు వైఫై డబ్బా షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

జియోకు వైఫై డబ్బా షాక్

November 20, 2017

అతి తక్కువధరకే  4జీ వేగంతో డేటాను అందించిన జియోకు.. బెంగళూర్‌కు చెందిన స్టార్టర్ కంపెనీ భారీ షాక్‌ను ఇవ్వనుంది. ‘వైఫై డబ్బా’ పేరుతో కేవలం రూ. 2కే 100 ఎంబీ డేటాను అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ వైఫై డబ్బాను 13  నెలల క్రితం బెంగళూరులో ప్రారంభించారు.  ఇప్పటికే రూ.2కు 100 ఎంబీ డేటా, రూ.10కి 500ఎంబీ డేటా, రూ.20కి 1జీబీ చొప్పున టారిఫ్‌లను అందిస్తుంది.  ప్రీపెయిడ్ టోకెన్ల ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

మెుబైల్ నంబర్‌ను ఓటీపీ ద్వారా వెరిఫై చేసిన తర్వాత డేటాను అందిస్తుంది. అందుకోసం ఆయా ప్రాంతాల్లో రూటర్లును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్‌లో డేటాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారులకు మేలు చేయడానికే ఈ సంస్థ ప్రారంభించామని వైఫై డబ్బా వ్యవస్థాపకులు తెలిపారు. త్వరలోనే తమ సేవలను పూర్తి స్థాయిలో విస్తరిస్తామని  తెలిపారు.