బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర చాలా సంవత్సరాల క్రితం తనను రేప్ చేశాడంటూ అతని మేనకోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతోంది. హిమాచల్ ప్రదేశ్ చెందిన జితేంద్ర మేనకోడలు తాజా మీడియా ముందుకు వచ్చింది.
‘ నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు మామయ్య జితేంద్ర షూటింగ్కు మా నాన్నతో కలిసి వెళ్లాను. ఆ సమయంలో జితేంద్ర నన్ను చెరపట్టాడు. ఈ విషయం తెలిసి నా తల్లిదండ్రులు గుండెలు పగలి చనిపోయారు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నా కానీ నా తల్లిదండ్రులు వద్దనడంతో మానేశా.
అంతేగాక జితేంద్రకు అప్పట్లో రాజకీయ పలుకుబడి ఉండడంతో భయపడ్డాను. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని, మహిళా సంఘాల పుణ్యమా అని నాకు ధైర్యం వచ్చింది. త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’ ఆమె తెలిపింది. తనకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పింది. అయితే తన మేనకోడలు చేసిన ఆరోపణలపై సీనియర్ హీరో జితేంద్ర మాత్రం స్పందించలేదు.