త్వరలో లక్షా12 వేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో లక్షా12 వేల ఉద్యోగాలు

October 30, 2017

సోమవారం ఉభయసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ  ‘అతి త్వరలో  లక్షా 12 వేల ఉద్యోగాలను 100 శాతం భర్తీ చేస్తామని’ తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్  పథకానికి పరిమితి లేదు, అర్హులందరికి ఈ పథకం వర్తించేలా చర్యలను తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

బలహీన వర్గాల కోసం అనేక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ నిర్వహిస్తామని తెలిపారు. టిఎస్‌పిఎస్సీలో ఘంటా చక్రపాణి అనేక సంస్కరణలు చేశారు, అందుకుగాను అతనిని యూపిఎస్సీ అభినందించినందని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సలహాలను ఇస్తే స్వీకరిస్తాం కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడితే, వారికి గౌరవం ఉండదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తామని  సీఎం తెలిపారు.