అట‌వీ అనుమ‌తుల్లో తెలంగాణ భేష్‌ - MicTv.in - Telugu News
mictv telugu

అట‌వీ అనుమ‌తుల్లో తెలంగాణ భేష్‌

December 12, 2017

కేంద్రం నుంచి అట‌వీ అనుమ‌తుల‌ను సాధించ‌డంలో తెలంగాణ రాష్ర్టం ముందు వ‌రుస‌లో ఉంద‌ని అట‌వీ శాఖ మంత్రి జోగు రామ‌న్న అన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అట‌వీ అనుమ‌తుల‌ను కేంద్రం నుంచి స‌త్వర‌మే సాధించిన ఘ‌న‌త రాష్ర్ట అట‌వీ శాఖ‌కే ద‌క్కుతుంద‌న్నారు. 

తెలంగాణ రాష్ర్టంలో ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం స‌త్వర‌మే అట‌వీ అనుమ‌తులు సాధించిన సంద‌ర్భంగా అట‌వీ శాఖ అధికారులు మంగ‌ళ‌వారం మంత్రి జోగు రామ‌న్నను స‌చివాల‌యంలో క‌లిసి పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు  సాగాల‌ని మంత్రి జోగు రామ‌న్న అధికారుల‌ను సూచించారు. ఈ సంద‌ర్భంగా అట‌వీ అధికారుల‌ను ఆయన అభినందించారు.