ఎన్టీఆర్‌పై   అభిమానుల వినూత్న  అభిమానం... - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌పై   అభిమానుల వినూత్న  అభిమానం…

April 11, 2018

నటులపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడిపై ఎనలేని అభిమానాన్ని వెరైటీగా చూపించారు. ఎన్టీఆర్ మే 20 1983న జన్మించాడు. ఆయన ఈ ఏడాది మే 20తో 35 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు ఆయన చిత్రాలలోని పాత్రలకు సంబంధించి 35 పేజీల పుస్తకాన్ని రూపొందించనున్నారు. ఇందులో రోజుకో పేజీ చొప్పున 35 రోజులు పాటు రోజుకో పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.తొలి పోస్టర్‌గా ఈ రోజు ‘బాల రామయణం’లోని  బాలరాముడి పోస్ట‌రను విడుదల చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సంబంధించి సంక్షిప్త వివ‌రాలు కూడా వెల్ల‌డించారు. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 1996లో బాల రామాయ‌ణం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ఓ చిత్రం, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.