నాన్నతో నటించనున్న అభయ్‌రామ్ - MicTv.in - Telugu News
mictv telugu

నాన్నతో నటించనున్న అభయ్‌రామ్

October 26, 2017

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్  కొడుకు అభయ్ రామ్ ఓ చిన్న పాత్రలో కన్పించబోతున్నాడని సమాచారం.

సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అభయ్‌రామ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తారక్‌ సినిమా షూటింగుల్లో అప్పుడప్పుడు అభయ్ కూడా సందడి చేస్తుంటాడు. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమాలోతన  కొడుకు నటిస్తాడాలేదా అనే విషయంపై ఎన్టీఆర్ మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.  తండ్రి నటిస్తున్న సినిమాల్లో కొడుకుల ఎంట్రీలు కొత్తేం కాదు, ఈమధ్యే విడుదలైన  ‘రాజా దిగ్రేట్‌’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో రవితేజ కొడుకు మహాధన్‌ నటించాడు, ‘నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్‌ నటించాడు.