‘జూలీ 2’ నగ్మా కథేనట - MicTv.in - Telugu News
mictv telugu

‘జూలీ 2’ నగ్మా కథేనట

November 23, 2017

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్ సినిమాల ట్రెండు నడుస్తున్నది. తాజాగా రాయ్‌లక్ష్మీ నటించిన ‘ జూలీ 2 ’ సినిమా సీనియర్ నటి నగ్మాదేనని పుకారు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నది. దీపక్ శివదాసాని దర్శకత్వంలో రూపొందిన  ఈ సినిమా అక్టోబరులో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల నవంబర్ 24 కు వాయిదా వేసారు. కాగా ఈ సినిమా నగ్మా జీవితం ఆధారంగా తెరకెక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్ళయిన సూపర్ స్టార్‌తో ఎఫైర్, క్రికెటర్ సౌరబ్ గంగూలీతో ప్రేమ వంటి అంశాలను ఈ చిత్రంలో టచ్ చేస్తున్నట్టు వినికిడి. తెలుగులో ఘరానా మొగుడు, రిక్షావోడు, బాషా వంటి సినిమాల్లో నటించి నగ్మా మంచి గుర్తింపు తెచ్చుకుంది.