‘జూలీ 2’గా రాయ్ లక్ష్మీ - MicTv.in - Telugu News
mictv telugu

‘జూలీ 2’గా రాయ్ లక్ష్మీ

August 30, 2017

‘ కాంచన ’ సినిమాలో లారెన్స్ సరసన నటించిన లక్ష్మీరాయ్ మనందరికీ గుర్తున్న భామే. ఇప్పుడీ ముద్దుగుమ్మ బాలీవుడ్ బాట పట్టింది. ఇంతకు ముందే ‘ అకీరా ’ సినిమాలో చిన్న రోల్ చేసి బాలీవుడ్ జనాలకు నోటీస్ అయింది.

ఇప్పుడు తాజాగా తను ‘ జూలీ 2 ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. లక్ష్మీరాయ్ ఇప్పుడు తన పేరును తిరగేసి రాయ్ లక్ష్మీగా మార్చుకుందనే విషయం తెలిసిందే. 2004 లో నేహా ధూపియా ప్రధాన పాత్రలో వచ్చిన ‘జూలీ ’ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ సినిమా.

ఈ సినిమాకు దీపక్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. రాయ్ లక్ష్మీ ఇందులో చాలా హాట్ గా కనిపిస్తోంది. సెప్టెంబర్ 4 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తనకు బాలీవుడ్ లో మంచి బోణీని ఇస్తుందని భావిస్తున్న లక్ష్మీకి ఆల్ ది బెస్ట్ చెబుదామా.