బాలచందర్ ఆస్తుల వేలం.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలచందర్ ఆస్తుల వేలం..

February 14, 2018

వాస్తవిక జీవితాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు కే. బాలచందర్ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఓ బ్యాంకు ప్రకటించింది. ఈ ప్రకటన తమిళనాడులో కలకలం రేపింది. ఎన్నో అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన మహా దర్శకుడి ఇల్లు వేలం వేయడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల వేలాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి ఒక  ప్రకటన విడుదల చేశారు‘బాలచందర్‌కు చెందిన కవితాలయా సంస్థ నిర్మించిన టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యుకో బ్యాంకులో తాకట్టు పెట్టాం. 2015లో సీరియల్‌ నిర్మాణ పనులను రద్దుచేసి డిజిటల్‌ నిర్మాణ పనులు చేపట్టాం. అప్పటివరకు బ్యాంకులో తీసుకున్న రుణంపై అసలుతో పాటు వడ్డీ కూడా కొంతమేరకు చెల్లించాం. మిగిలిన రుణ మొత్తాన్ని బ్యాంకులో ఒకేసారి చెల్లించేందుకు యత్నిస్తున్నాం.. ఈ సమయంలో బ్యాంకు వేలం ప్రకటన చేసింది.. అది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. నాన్న అభిమానులు కలత చెందాల్సిన అవసరం లేదు..’ అని బాలచందర్ కూతురు చెప్పింది.