కడపంటే ఫ్యాక్షన్.. కడప అంటే యాక్షన్.. కడప అంటే టెన్షన్.. - MicTv.in - Telugu News
mictv telugu

కడపంటే ఫ్యాక్షన్.. కడప అంటే యాక్షన్.. కడప అంటే టెన్షన్..

December 19, 2017

‘ కడప.. కడప.. కడప.. కడప.. అది యమద్వారపు గడప.. కడప అంటే ఫ్యాక్షన్, కడప అంటే ఆక్షన్, కడప అంటే టెన్షన్, కడపే అటెన్షన్, కడపంటే ఊరు కాదు.. బాంబురా కొడకా.. కడపను తిరగేస్తే పడక.. కానీ అది చావు పడక ’ అంటూ సాగే ‘ కడప ’ వెబ్‌సిరీస్ పాటను విడుదల చేశాడు వర్మ. ‘ కడపంటే వర్మ చూపించినంత సినిమా వుండదని ’ చాలా మంది తమ అభిప్రాయాలు తెలిపినా.. రక్తపాతాలు, మర్డర్లు, మాన భంగాలతో ఈ వెబ్‌సిరీస్‌లో రెచ్చిపోయాడు వర్మ.. అని ఎందరు ఎన్ని కామెంట్లు చేసినా అవేవీ పట్టించుకోకుండా వర్మ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ఈ క్రమంలోనే కడప పాటను విడుదల చేశాడు. ఈ పాటను రచయిత సిరాశ్రీ రాయగా ఈ పాటలోని లిరిక్స్ కలకలం రేపుతున్నాయి. పాటలోనూ తన ముద్రను పోనిచ్చుకోలేదు వర్మ. వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు, రేపులతో పాటను సాంతం నడిపించాడు పాటను.