యాప్ అనుభవం లేని దొంగ.. మూడు నిమిషాల్లోనే చిక్కాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

యాప్ అనుభవం లేని దొంగ.. మూడు నిమిషాల్లోనే చిక్కాడు..

December 4, 2017

కడప జిల్లా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ఓ యాప్ వాడుతున్నారు. రియల్ ‘టైమ్ గవర్నెర్స్’‌ను అమలు చేయడం ప్రారంభించి తొలి ఫలితాన్ని చూపారు. తాళం వేసివున్న ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించగా, మూడు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని దొంగను అరెస్టు చేసి శభాష్ అనిపించుకున్నారు.

‘ఎవరైనా ఇలు వదలి బయటకు వెళ్లాల్సివస్తే ‘ఎల్‌హెచ్ఎంఎస్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారి వివరాలను నమోదు చేయండి. మీ ఇంటికి మేం కాపలా కాస్తాం’ అని  వినూత్నంగా కడప పోలీసులు ప్రచారం చేశారు. దీంతో చాలామంది యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ ఇళ్లకు వచ్చి ఓ ప్రత్యేక పరికాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి ఎవరు వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్‌లో అలారం కంగుమని మోగుతుంది. ఈ నూతన టెక్నాలజీ  ద్వారా నిందితుడిని వెంటనే పట్టిస్తుంది.నవంబర్ 14న  కడప చిన్న చౌక్ ప్రాంతానికి చెందిన మహేశ్ ఊరికి వెళ్లి, తిరిగి డిసెంబర్ 8న వస్తామని ఎల్‌హెచ్ఎంఎస్ ఏర్పాటు చేయాలని పోలీసులను కోరాడు. తర్వాత ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన యాప్ అనుభం లేని  దొంగ రాత్రి  2:10 సమయం‌లో ఇంట్లోకి దూరాడు. వెంటనే పోలీసులకు విషయం తెలిసిపోయింది.  పోలీసు కంట్రోల్ రూంలో సైరన్ మోగగా, మూడు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న దొంగను అరెస్టు చేశారు. దాంతో ఇప్పుడు కడప పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.