2 కోట్ల ఆఫర్‌ను వదులుకున్న కాజల్ - MicTv.in - Telugu News
mictv telugu

2 కోట్ల ఆఫర్‌ను వదులుకున్న కాజల్

April 6, 2018

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఈ పదేళ్లలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అన్నీ భాషల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా ఒప్పుకున్నా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది ఈ అమ్మడు. కాగా ఆమెకు రెండు కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చాడు ‘ చంద్రముఖి ’ సినిమా దర్శకుడు పి. వాసు. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలామంది కథానాయికలు అనుకుంటారు. కానీ కాజల్ ఎందుకో ఆ ఆఫర్‌ను సుతిమెత్తగా తిరస్కరించిందట.కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాను రూపొందించడానికి పి. వాసు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ కోసం కాజల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించిన ఆయనకు కాజల్ తిరస్కరణ తికమకకు గురిచేసింది. పూర్తి కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు తానింత వరకు చేయలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్టుందని అనుకుంటున్నారు ఆమె అభిమానులు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన చాలాండి నటీమణులకు తర్వాత అవకాశాలు సన్నగిల్లడం, చిన్నాచితకా పాత్రలకు పరిమితమవడం వంటి నేపథ్యంలో కాజల్ ఈ ఆఫర్ ను వదులుకున్నట్లు భావిస్తున్నారు.