కాజల్ పెద్దమ్మ అయిపోయింది..! - MicTv.in - Telugu News
mictv telugu

కాజల్ పెద్దమ్మ అయిపోయింది..!

February 22, 2018

అందాల తార కాజల్ అగర్వాల్ పెద్దమ్మ అయిపోయింది. తన చెల్లెలు నిషా అగర్వాల్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కాజల్ తన ట్విటర్‌లో తెలిపింది. తనకు ‘ నిషాన్ ’ అని పేరు పెడుతున్నట్టు వెల్లడించింది. దీంతో నీ పెళ్లెప్పుడు అని అభిమానులు ఆమెను సరదాగా అడుగుతున్నారు.  తను సినిమాల్లో బిజీగా వున్నప్పుడే చెల్లెలు నిషా అగర్వాల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసింది కాజల్. ఇద్దరు అక్కా చెళ్ళెల్లు పోటాపోటీగా సినిమాలు చేశారు.‘సోలో’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించింది నిషా. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఒక ప్రముఖ వ్యాపార వేత్తను నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది.