వీధి కుక్కకు రూ. 3 కోట్ల ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

వీధి కుక్కకు రూ. 3 కోట్ల ఆఫర్

March 8, 2018

వీధి కుక్కకు మూడు కోట్లా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవును అది వీధి కుక్కే  కానీ ‘కాలా’లో నటించిన కుక్క. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా చూసుకున్న కుక్క. ‘కాలా’ సినిమాలో ఆయన పెంపుడు  కుక్కగా మణి అనే ఓ వీధి కుక్క నటించింది. నటించిన ఒక్క సినిమాతోనే దానికి చాలా పాపులారిటీ వచ్చేసింది.సినిమాలకు  కుక్కలను సప్లై చేసే సిమన్ అనే వ్యక్తికి  చెన్నైలోని ఓ రోడ్డు మీద ఈ కుక్క దొరికింది. దానికి  మణి అని పేరు పెట్టి పెంచుతున్నాడు. అయితే కాలా సినిమాకు  ఓ కుక్క కావాలనిన ఆ సినిమా డైరెక్టర్ రంజిత్ సీమన్‌ని అడుగగా  అతనికి తన వద్ద ఉన్న కుక్కలన్నింటిని చూపిస్తే ఈ మణి కుక్కను డైరెక్టర్ ఒకే చేశాడట. షూటింగ్ జరిగినన్ని రోజులు  రజినీ కాంత్ కు కూడా ఈ కుక్క చాలా దగ్గరైంది. అయితే ఇప్పుడు ఆ మణిని మాకిచ్చేయండి కోట్ల రూపాలయలు ఇస్తాం అని చాలా మంది అడుగుతున్నా  సీమన్ దాన్ని అమ్మడానికి ఒప్పుకోవడం లేదు. ‘ నేను దీన్ని నా కన్న బిడ్డలా పెంచాను. డబ్బులకు బిడ్డను అమ్ముకునే దుస్థితికి నేనింకా దిగ జారలేదు’ అని సిమన్ చెబుతున్నాడు. ఏది ఏమైనా  ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటారు. అలాగే ఈ వీధి కుక్కకు కాలా సినిమా ద్వారా ఆ రోజు వచ్చిందన్నమాట.