కమల్ రాజకీయ యాత్ర షురూ.. కలాం ఇంటి నుంచి.. - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ రాజకీయ యాత్ర షురూ.. కలాం ఇంటి నుంచి..

February 21, 2018

‘ సాధారణ ఇళ్లలో నివసించడంలోనే గొప్పతనం ఉంది ’ అని కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కమల్ హాసన్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు.  ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ యాత్ర ప్రారంభమైంది. రామేశ్వరం వెళ్ళిన కమల్..  కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి డియారం కానుకగా ఇచ్చారు. ఈ రాజకీయ యాత్రకు ‘నలై నమతే’ అనే పేరు పెట్టారు. తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు. యాత్రలో భాగంగా కమల్‌ స్వస్థలమైన పరమకుడి, రామంతపురం, శివగంగ తదితర ప్రాంతాల్లో మీడియాతో సమావేశమవుతారు.

ఉదయం 9 గంటలకు ఆయన మత్య్సకారులతో సమావేశమయ్యారు. 10 గంటలకు హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు. అక్కడినుండి కమల్ మదురై వెళ్తారు. ఇక్కడి కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రజనీకాంత్‌లు హాజరయ్యే అవకాశం వుంది. రాజకీయ పార్టీ ప్రకటించనున్న కమల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభినందించారు. కాగా సాయంత్రం 6 గంటలకు పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటిస్తారు కమల్.