దొంగ జపం… హత్య చేసేముందు కాళీమాతకు… - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ జపం… హత్య చేసేముందు కాళీమాతకు…

November 21, 2018

600 దొంగతనాలు, 7 హత్యలు, ఫరిదాబాద్‌, పల్వాల్‌, కురుక్షేత్ర, పంజాబ్‌ ప్రాంతాల్లో ప్రజలకు వణుకు పుట్టించాడు.. ఇదీ ఆ గజదొంగ నేర చరిత్ర.  దొంగలకు సెంటిమెంట్లు, వాటికి ఆంటిమెంట్లు రాయడం వంటి తలతిక్క పనుల గురించి అస్సలు తెలియవు. ఎందుకంటే వాళ్ళకు అవన్నీ పట్టవు గనక. ఇంత క్రైం రికార్డ్ కలిగిన ఈ దొంగ మాత్రం కాళీ మాతకు పరమ భక్తుడు. చేసే నేరాలు, హత్యలు చేస్తాడు. చేసేముందు కాళీమాతకు జపం చదువుతాడు. చేస్తున్నదాన్ని మన్నించమని కోరుతాడు. అనంతరం దారుణానికి ఒడిగడతాడు. కానీ, చివరికి అతని పాపం పండింది. పోలీసులకు చిక్కాడు.Telugu news Kali mantra chanting serial killer confesses to 7 murders, 600 lootsహర్యానాలోని ఫరిదాబాద్‌‌లో జరిగింది ఈ ఘటన. దొంగతనాలు, దారుణ హత్యలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు కిల్లర్. అతణ్ణి పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని పేరు జగ్తార్‌ సిన్హా. పోలీసుల విచారణలో అతను చెప్పిన నిజాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిందితుడు హత్య చేసే ముందు, తన పాపాలకు ప్రాయశ్చితంగా కాళీ మాత మంత్రాలతో 108 సార్లు జపం చేస్తానని మీడియా ముందే తన నేరాలను ఒప్పుకున్నాడు. ఎవరినైనా చంపేముందు కాళీ మాత మంత్రాలను జపిస్తానని, ఈ పాపాల నుంచి రక్షించమని ఆ దేవతను కోరుకుంటానన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.