‘ఎన్టీఆర్’ సినిమాలో కళ్యాణ్‌‌రామ్   - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎన్టీఆర్’ సినిమాలో కళ్యాణ్‌‌రామ్  

October 30, 2017

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’.  నందమూరి కళ్యాణ్‌‌రామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో చైతన్య రథం ముఖ్య పాత్ర పోషించింది.

ఆ రథాన్ని ఎన్టీఆర్ కోసం, ఆయన కొడుకు హరికృష్ణ  ప్రత్యేకంగా తయారు చేయించాడు. దానిపైన ఎన్టీఆర్ 75 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊరు,ప్రతి వాడ తిరిగి ప్రజలను కలుసుకున్నారు.

 ఆ రథాన్ని ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణనే రథ సారథిగా నడిపాడు. ఎన్టీఆర్   జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ చైతన్య రథాన్ని చూపించబోతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నటీమణులు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.