దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగింది - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగింది

November 2, 2017

కొత్త పార్టీ పెట్టబోతున్న కమల్‌హాసన్  బీజేపీకి వ్యతిరేకంగా మళ్లీ వ్యాఖ్యలు చేశాడు. ‘దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయింది, దాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని’ కమల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఈ హిందూ ఉగ్రవాదం మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు, కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు దారుణంగా మారాయని కమల్ మండిపడ్డారు. కమల్ వ్యాఖ్యలపై  బీజేపీ నేతలు మండిపడుతూ ‘కమల్ ఓ అవినీతి పరుడు, కేవలం స్వలాభం కోసమే ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడని’ ఆగ్రహం వ్యక్తం చేశారు.