ప్రేమజంటకు కమల్ స్పెషల్ బిర్యానీ విందు

నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన తండ్రి మనసును చాటుకున్నారు.  ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు సుజా వరూణి, శివకుమార్‌‌లను బుధవారం తన ఇంటికి ఆహ్వానించి బిర్యానీ విందు ఇచ్చారు. ఇంటి పడుచు లాంఛనాలు సమర్పించారు. విందులో నటి, మక్కళ్ నీది మయ్యం పార్టీ సభ్యరాలు శ్రీప్రియ, నటుడు నాజర్ సతీమణి కమీల పాల్గొన్నారు.Telugu news Kamal Hassan's Special Biriyani Treat to Suja Varunee and Shivakumar the Newly Married Couple సుజావరూణి బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని చాలా పాపులర్ అయిన నటి. శివ కుమార్ యువ నటుడు, శివాజీగణేశన్ మనవడు. శివాజీ గణేషన్ కొడుకు రామ్ కుమార్, ఆయన కొడుకు శివకుమార్. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరి వివాహం చెన్నైలో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

కమల్ నా తండ్రిలాంటివారు…

నేను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. ఆయన స్థానంలో నటుడు కమలహాసన్ను చూసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను బిగ్బాస్ గేమ్ షోలో పాల్గొన్నానో అప్పటినుంచి నాకు కమల్‌లో మా నాన్న కనిపించారు. అందుకే నా పెళ్లిలో ఆయన నా తండ్రి స్థానంలో వుండాలని కోరాను. అందుకు ఆయన కూడా అంగీకరించారు. అయితే ఇటీవల గజ తుపాన్బాధితులను పరామర్శించడంలో తలమునకలవడంతో ఆయన మా పెళ్లికి రాలేకపోయారు. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చిన వెంటనే మా పెళ్లి విషయాన్ని గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందానికి గురిచేస్తోంది.