సినిమాలకు కమల్ హాసన్ గుడ్‌బై - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలకు కమల్ హాసన్ గుడ్‌బై

February 14, 2018

పద్మభూషణ్, విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. భవిష్యత్తులో సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నాని ,అందుకే  ఈ నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని,వెనక్కి తగ్గేది లేదని సృష్టం చేశారు.

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు రెండు నెలల క్రితమే ప్రకటించారు. ఈ నెలలోనే పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలు తప్ప ఇకపై నేను ఏ సినిమాలోనూ నటించను’ అని ఆయన అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.‘నిజాయితీగా జీవించేందుకు ఏదైనా చేయాలనుకుంటున్నాను.  నేనేమీ ఓడిపోతాననుకోవడం లేదు. నాకు రాజకీయాల్లో లేకున్నా 37 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తూనే ఉన్న. ఇప్పుడు  10 లక్షల మంది నమ్మకమైన కార్యకర్తలను సమీకరించాను. నా ఆదేశాలతో వారు మరెంతో మందిని ఇందులో భాగస్వాములను చేశారు’ అని కమల్ తెలిపారు.

‘నాకు సంపాదన ఉంది. నా బ్యాంకు బ్యాలన్స్‌ను పెంచుకోవడం కోసం ఇక్కడికి రాలేదు. సంతోషంతో ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం గడపగలను. కానీ, నటుడిగా చనిపోవాలనుకోవడం లేదు. ప్రజా సేవలోనే ప్రాణాలు విడవాలనుకుంటున్నాను. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వివరించారు.  కాషాయం (బీజేపీ) అంటే తనకు పడదని,  తన రాజకీయాలు నలుపు రంగులోనే ఉంటాయని, అది ద్రవిడుల చర్మాన్ని, గొంతుకను  ప్రతిబింబిస్తుందని కమల్ అన్నారు.