కమల్ నాకు డబ్బు ఎగ్గొట్టాడు.. గౌతమి - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ నాకు డబ్బు ఎగ్గొట్టాడు.. గౌతమి

February 26, 2018

కమల్ హాసన్ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, అడిగిన ప్రతీసారి మాట దాటవేస్తున్నారని ఆయన మాజీ భార్య, నటి గౌతమి ఆరోపించారు. ‘ దశావతారం, విశ్వరూపం సినిమాలకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. ఆ సినిమాలు విడుదలైపోయనప్పటికీ నా పారితోషకం ఇంకా చెల్లించలేదు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి ’ అంటూ గౌతమి వాపోయారు. కాగా కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టిన సందర్భంగా మీడియా గౌతమిని కలిసి కొన్ని ప్రశ్నలు అడిగింది. పార్టీలో గౌతమి చేరుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న వార్తలు ఎంతవరకు నిజమనగా, దాన్ని పూర్తిగా ఖండించారు గౌతమి. తాను కమల్ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు.

పార్టీ పుణ్యమా అని మళ్ళీ వీరిద్దరు కలిస్తారేమోనన్న వార్తలపై గౌతమి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మేమిద్దరం మళ్ళీ కలిసి జీవిస్తామని వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. 2016 లో అతణ్ణి విడిచేసి వచ్చాక మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. నా కుమార్తె, నేను  భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చాం. నేను, కమల్‌ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదు, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదు. మేమిద్దరం కలిసి జీవిస్తామనే ప్రశ్న అడగటం మర్చిపోతే చాలా బాగుంటుంది ’ అని ఘాటుగా స్పందించారు గౌతమి.