కమల్ కొత్త పార్టీ పేరు ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ కొత్త పార్టీ పేరు ఇదే..!

February 21, 2018

మధురై ఒత్తకడై మైదానంలో జరుగుతున్న బహిరంగసభలో కమల్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన  కమల్ ఆ తర్వాత తన పార్టీ పేరు ‘మక్కల్ నీతి మయ్యం’ అని ప్రకటించారు.

ఈ బహిరంగసభకు ముఖ్య అతిథిగా డిల్లీ సియం కేజ్రీవాల్ రాగా, కమల్ అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లో కమల్ తన పార్టీ విధి విధానాలు, మిగతా వివరాలు ప్రకటించనున్నారు. అబ్దుల్ కలాం స్పూర్తితో రామేశ్వరం నుంచి కమల్ తన రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.