లెఫ్ట్ కాదట,రైట్ కాదట..సెంటర్‌లో ఉండి రాజకీయం చేస్తాడట! - MicTv.in - Telugu News
mictv telugu

లెఫ్ట్ కాదట,రైట్ కాదట..సెంటర్‌లో ఉండి రాజకీయం చేస్తాడట!

February 21, 2018

నటుడు కమల్‌హాసన్ కొత్త రాజకీయ పార్టీని ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు ‘మక్కల్ నీది మయ్యం’ అని పెట్టారు. తెలుగులో దీని అర్థం ‘ప్రజల న్యాయ వేదిక’. బహిరంగసభలో కమల్ మాట్లాడుతూ ‘మయ్యం అంటే లెఫ్ట్ కాదు రైట్ కాదు సెంటర్’ అని స్పష్టం చేశాడు.

‘కుల మత రాజకీయాలకు అతీతంగా  నిజమైన పాలన అంటే ఏంటో చూపిస్తా,అన్ని వర్గాల సంక్షేమమే నా లక్ష్యం, రాష్ట్రం నుంచి అవినీతిని తరిమేస్తా, ఒక్కరోజు ఆటకోసం నేను రాజకీయాల్లోకి రాలేదు,నేను నాయకుడిని కాదు మీలో ఒకడిని,సలహాలు తీసుకునే వాడినే కానీ ఇచ్చేవాన్ని కాను. నేను పార్టీ నేతను కాదు ఆయుధం లాంటి వాడిని, కావేరీ తీర్పును అందరూ గౌరవించాలి,చంద్రబాబు, ఒబామా అందరూ ఇష్టమే. ఇన్నాళ్లు డబ్బుకోసం సినిమాలు చేశాను..

ఇక నుంచి ప్రజలకోసం పనిచేస్తాను’ అని ప్రసంగించారు కమల్. పార్టీ జెండాలో ఉన్న లోగోలోని ఆరు చేతులు ఆరు రాష్ట్రాలకు సంకేతాలు కాగా మధ్యలో నక్షత్రం ప్రజలకు సంకేతం అని చెప్పారు. అయితే తమిళరాజకీయ చరిత్రలో ద్రవిడ పదం లేకుండా పార్టీ పేరును  ప్రకటించడం విశేషం.