కమల్ హాసన్ సొంత పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించాడు. ఇన్నాళ్ళూ తను ఏ పార్టీలో చేరతాడో అనే అనుమానాలకు స్పష్టతనిస్తూ కమల్ తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అదీ తన సొంత పార్టీతోనే అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. ‘ పార్టీని ప్రారంభించే దిశలో పార్టీ జెండా, అజెండాల రూపకల్పనలో వున్నామని, నేను రాజకీయాల్లోకి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నాను. నా భావజాలానికి ఏ పార్టీ సరితూగదు. అందుకే ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని స్వయంగా చెప్పాడు. నేను రాజకీయాల్లోకి వచ్చి గెలిస్తే ప్రతీ ఓటరుకు జవాబుదారీగా వుంటానని, అలాగే ఓటర్లు నాకు ఓటు వేసే ముందు ఆలోచించమని చెప్తా. ఎందుకంటే నచ్చకపోతే గెంటెయ్యటానికి ఐదేళ్ళ టైం పడుతుంది. రాజకీయాల్లో మార్పు రావాలంటే నేను రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని ’ చెప్పాడు కమల్. చివరగా ‘ రాజకీయాల్లో నేనుంటే అవినీతి వుండదు – అవినీతి వున్న చోట నేనుండను ’ అని చెప్పి ముగించాడు.