2019లో మాదిగ మహిళ ముఖ్యమంత్రి కావాలి !   - MicTv.in - Telugu News
mictv telugu

2019లో మాదిగ మహిళ ముఖ్యమంత్రి కావాలి !  

February 7, 2018

సమాజంలో మార్పు వస్తేనే మానవ సమాజం సుఖంగా,సంతోషంగా ఉంటుందని ఓయూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. మంగళవారం ఓయూలోని టెక్నాలజీ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి మాదిగ మహిళల ఆత్మీయ సమ్మేళనం జరింది. ఈ కార్యక్రమానికి కంచె ఐలయ్య ముఖ్య  అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ‘ ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓ దళితుడు ముఖ్యమంత్రి అవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ అది కాలేదు. 2019లో జరగబోయె ఎన్నికల్లోనైనా మాదిగ మహిళను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని పార్టీలు  పోరాడాల్సిన అవసరం ఉందని’ ఆయన చెప్పారు.

రాష్ట్ర పంచాయతీ అడీషనల్ చీఫ్ సెక్రటరీ జూపాక సుభద్ర మాట్లాడుతూ ఒక్కో గ్రామం మాదిగ మహిళల శ్రమ నుంచి ఉద్బవించిందని అన్నారు. మహిళ అంటేనే మానవ జీవితానికి పునాది లాంటిదని టీఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.