అంబేద్కర్‌కి కందికొండ అక్షర నివాళి - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్‌కి కందికొండ అక్షర నివాళి

April 14, 2018

మనువాదానికి వ్యతిరేకంగా జీవితమంతా పోరాడిన వ్యక్తి డా. అంబేద్కర్. ఆయన ఆశయాలు ఆచరణీయం. ఈ దేశానికి ఆయన ఇచ్చిన గొప్ప కానుక రాజ్యాంగం. ఆయన గురించి ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం చాలా వుంది. అంబేద్కర్ గురించి పూర్తిగా తెలపటం కోసం ఓ పాట రూపు దిద్దుకుంది. ఆ మహానుభావుడికి ఇచ్చే నివాళిగా ప్రముఖ పాటల రచయిత డా. కందికొండ రాసిన ఈ పాట ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదల అయింది. దీనిని కందికొండే నిర్మించడం విశేషం. నందన్ రాజ్ బొబ్బిలి సంగీతం అందించారు. తేలు విజయ, శంకర్ బాబు కందుకూరి ఆలపించారు.

బ్రహ్మణిజం – బహుజనవాదం ఈ రెండింటి ఘర్షణే ఈ దేశ చరిత్ర అన్నారు అంబేద్కర్. బ్రహ్మణిజం, కేపటలిజం కార్మికవర్గ ప్రధాన శతృవులు అంటారు . జ్ఞానం, పోరాటం, సంఘ నిర్మాణం నా జీవన లక్ష్యాలు అన్న రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు నివాళిగా ఈ పాట రూపొందింది అన్నారు డా. కందికొండ.

కెమెరా : సాయితేజ కుందారం

ఎడిటింగ్ : ఉదయ్ కుంబం