ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా  రాజసం - MicTv.in - Telugu News
mictv telugu

ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా  రాజసం

November 1, 2017

తెలుగు డైరెక్టర్ క్రిష్  దర్శకత్వంలో  హీరోయిన్  కంగనా రనౌత్  నటిస్తోన్న సినిమా ‘మణికర్ణిక’. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా  ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  అయితే  ప్రస్తుతం రాజస్థాన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

అందులో కంగానా  ఫోటోలు కొన్ని  వైరల్ అయ్యాయి. ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కంగనా కట్టు బొట్టు  అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈసినిమాకు కథను అందించారు.  వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27 న ఈసినిమాను విడుదల చేయాలాని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.