కంగన మళ్లీ గాయపడింది! - MicTv.in - Telugu News
mictv telugu

కంగన మళ్లీ గాయపడింది!

November 22, 2017

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్  మరోసారి గాయాలపాలైంది. డైరెక్టర్ క్రిష్  దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక-ద క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా షూటింగ్‌లో కంగనా కాలికి గాయమవడంతో వెంటనే చిత్రయూనిట్ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెద్దగా ప్రమాదమేమి లేదని, కాని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో  కంగానా షూటింగ్‌కి విరామం ఇచ్చి ముంబై వెళ్లింది.

 గతంలో ఇదే సినిమాకు సంబంధించి కత్తి యుద్ధం చేస్తున్నప్పుడు కూడా..ముఖానికి కత్తి గుచ్చుకుని కంగనకు కుట్లు కూడా పడ్డాయి. ఈసినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రను పోషిస్తున్న కంగనా, ఆపాత్రకు న్యాయం చేయడంకోసం..

గాయాల పాలైనా కూడా బాగానే కష్టపడుతుంది అని చిత్రయూనిట్ మెచ్చుకుంటున్నారు. దర్శకుడు రాజమౌళి  తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ ‘మణికర్ణిక’  సినిమాకు కథను అందించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.