పాకిస్తాన్ ప్రేక్షకులు మెచ్చిన కేజీఎఫ్

కన్నడ సూపర్‌స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటించిన ‘కేజీఎఫ్‌’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ చిత్రానికి పాకిస్తాన్‌ సినీ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. పాక్‌లో విడుదలైన తొలి కన్నడ చిత్రమిదే కావడం విశేషం. ‘కేజీఎఫ్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ను లాహోర్‌, ఇస్లామాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 11న పాకిస్తాన్‌ దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు’ అని బెంగళూరుకు చెందిన సినీ విశ్లేషకుడు హరీశ్‌ మాల్యా వెల్లడించారు.

Telugu News kannada blockbuster kgf chapter 1 released in pakistan .

పీరియడ్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కర్ణాటకకు చెందిన కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగింది. గతేడాది డిసెంబర్‌ 21న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 18 రోజుల్లో రూ.200 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఏ కన్నడా చిత్రమూ ఇన్ని భాషల్లో విడుదల కాలేదు, ఇంతటి వసూళ్లు రాబట్టలేదు. ఈ బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు.

Telugu News kannada blockbuster kgf chapter 1 released in pakistan