mictv telugu

కరీంనగర్‌లో అఘోరాల ‘ఎన్నికల’ దందా..

February 13, 2019

కరీంనగర్ జిల్లాలో అఘోరాలు, నాగా సాధువులు కలకలం సృష్టిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన అఘోరాలు జిల్లాలో పలు పల్లెల్లో చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో సర్పంచ్ అభ్యర్థులకు మంత్రించిన రుద్రాక్షలను అందజేసి ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పి వెళ్లిపోయారు.

ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మళ్లీ ఊర్లపై పడ్డారు. గెలిచిన అభ్యర్థుల నుంచి మెడపట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రత్యర్థులతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని డబ్బులు తీసుకుని వెళుతున్నారు. దీంతో సర్పంచులు వారికి ఐదు వేలు, పదివేలు సమర్పించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే శాపాలు పెడతామని, చేతబడులు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు సాధువులు.  వీరు నిజంగా అఘోరాలేనా? లేదా ఆ వేషంలో వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిని నుంచి తపించుకోవడానికి సర్పంచులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.